Hyderabad, సెప్టెంబర్ 5 -- తెలుగులో వచ్చిన మరో హారర్ కామెడీ మూవీ బకాసుర రెస్టారెంట్. ఈ సినిమా ఆగస్టు 8న థియేటర్లలో రిలీజైంది. ప్రముఖ కమెడియన్లు ప్రవీణ్, హర్షలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఎంత మేర ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

తెలుగు హారర్ కామెడీ మూవీ బకాసుర రెస్టారెంట్ వచ్చే వారం ఓటీటీలోకి వస్తోంది. సన్ నెక్ట్స్ ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (సెప్టెంబర్ 5) వెల్లడించింది.

"ఐదుగురు యువకులు.. ఓ అతీత శక్తి.. సెప్టెంబర్ 12 నుంచి పీడకల మొదలు కాబోతోంది. సన్ నెక్ట్స్ లో చూడండి" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. తెలుగుతోపాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. కామెడీ, గందరగోళం, దెయ్యాలతో కూడిన మీ అ...