Hyderabad, సెప్టెంబర్ 12 -- తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ ఆర్టిస్ట్ ఈ ఏడాది మార్చి 21న థియేటర్లలో రిలీజైంది. మొత్తానికి సుమారు ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రావడం విశేషం. అయితే ఇప్పుడు కూడా రెంట్ విధానంలోనే అందుబాటులోకి రావడమే కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం.

తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 12) ఓటీటీలోకి వచ్చిన సినిమా కిల్లర్ ఆర్టిస్ట్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఫ్రీగా కాకుండా రూ.99 రెంట్ చెల్లిస్తేనే ఈ సినిమా చూసే అవకాశం ఉంటుంది.

ఎప్పుడో మార్చి 21న థియేటర్లలో రిలీజై సుమారు ఆరు నెలల తర్వాత అది కూడా ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా ఇప్పుడు రెంట్ విధానంలో అందుబాటులోకి రావడం విశేషం. ఈ కిల్లర్ ఆర్టిస్ట్ సినిమాకు ఐఎండీబీలో 8.8 రేటింగ్ నమోదైంది. బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల కూడా ముఖ్యమైన పాత్ర పోషి...