Hyderabad, జూలై 4 -- మీకు పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ అంటే ఇష్టమా? బ్రేక్ డ్యాన్స్ తెగ నచ్చేస్తుందా? అయితే ఇప్పుడు ఓటీటీలోకి తెలుగులోనూ రాబోతున్న ఈ మలయాళం మూవీ మిస్ కాకుండా చూడండి. మూన్‌వాక్ అనే ఈ మూవీ తెలుగు ట్రైలర్ శుక్రవారం (జులై 4) రిలీజైంది. ఈ ట్రైలర్ నవ్వులు పంచుతూనే.. కేరళలోని గ్రామీణ ప్రాంతాల్లోని యువత అదిరిపోయే డ్యాన్స్ మూవ్స్ కూడా చూపించింది.

మలయాళం మూవీ మూన్‌వాక్ (Moonwalk) ఈ ఏడాది మే 30న థియేటర్లలో రిలీజైంది. మైఖేల్ జాక్సన్ పాపులర్ డ్యాన్స్ మూవ్ పేరునే ఈ సినిమాకు పెట్టారు. ఇప్పుడీ సినిమా జులై 8 నుంచి జియోహాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతోంది. దీంతో మేకర్స్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. సుమారు రెండు నిమిషాల ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగా సాగింది.

కేరళలోని ఓ చిన్న ఊళ్లో బతుకుతెరువు కోసం ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడిపే క...