భారతదేశం, నవంబర్ 27 -- తెలంగాణ టెట్ - 2026(జనవరి) ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఆన్ లైన్ దరఖాస్తుల గడువు దగ్గరపడింది. నవంబర్ 29వ తేదీలోపే అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించాలి. అభ్యర్థులు ఆలస్యం చేయకుండా. వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ టెట్ అప్లికేషన్ ఫీజు కింద ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లు రాస్తే రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 27వ తేదీన టీజీ టెట్ - 2026 హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తారు.

తెలంగాణ టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులక...