భారతదేశం, డిసెంబర్ 31 -- రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి గాలుల తీవ్రతకు జనజీవనం అల్లాడిపోతున్నారు. ఉదయం, రాత్రి సమయాలాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి సింగిల్ డిజిట్‌కే పరిమితవుతున్న పరిస్థితులున్నాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఐఎండీ అంచనాల ప్రకారం.. ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి ప్రబలంగా ఉన్న తక్కువ స్థాయి గాలులు రాష్ట్రవ్యాప్తంగా శీతలగాలుల పరిస్థితులకు దోహదం చేస్తున్నాయి. రాబో...