భారతదేశం, ఫిబ్రవరి 4 -- తెలంగాణలోనూ బీజేపీ - జనసేన కలిసి పని చేయనున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీలు కీలక ప్రకటన చేశాయి. తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ - జనసేన పార్టీ అభ్యర్థుల విజయం కోసం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదలైంది.

"జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. జనసేన పార్టీ - భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ. ఫిబ్రవరి 7, 8 తేదీలలో తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ ఎన్నికల ప్రచార షెడ్యూల్ రూట్ మ్యాప్ త్వరలో ప్రకటిస్తాం" అని జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

జనసేన పార్టీ ప్రకటన కంటే ముందే పవన్ కల్యాణ్ తో కే...