భారతదేశం, ఏప్రిల్ 29 -- తెలంగాణలో నేటి నుంచి ఈఏపీ సెట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్‌ 2025 నిర్వహిస్తున్నారు. ఈఏపీ సెట్‌ పరీక్షకు హాజరయ్యే వారికి నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని కన్వీనర్‌ స్పష్టం చేశారు.

మే 2,3,4 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షల‌ను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. ఇంజీనిరింగ్ స్ట్రీమ్ కోసం 2 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు eapcet.tgche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

హోం పేజీలో కనిపించే డౌన్లోడ్ హాల్ టికెట్ (E & AP) లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త పేజీలో ఓపెన్ అవుతుంది.

ఇక్కడరిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయ...