భారతదేశం, మే 2 -- తెనాలిలో దారుణ హత్య వెలుగు చూసింది. ప్రేమించి పెళ్లాడిన భార్యే భర్తను బలి తీసుకుంది. దూరపు బంధువైన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు చివరకు ఆమె వల్ల ప్రాణాలు కోల్పోయాడు.

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేయించిన భార్య చివరకు పోలీసులకు పట్టుబడింది. వివాహేతర సంబంధాన్ని వదులుకోలేక ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య చివరకు కటకటాల పాలైంది. కేసు వివరాలను తెనాలి త్రీ టౌన్ పోలీసులు గురువారం వివరించారు.

సీఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం తెనాలికి చెందిన వెంకటమణి పృథ్వీరాజ్ కు అతని దూరపు బంధువైన వెంకటలక్ష్మితో 5 ఏళ్ల క్రితం పెళ్లైంది. వెంకటలక్ష్మీ మొదటి భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో ప్రధృీరాజ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు పిల్లలు లేరు...