భారతదేశం, మే 13 -- పంజాబ్​ అమృత్​సర్​లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మజితా బ్లాక్ పరిధిలోని గ్రామాల్లో కల్తీ మద్యం సేవించి 15 మంది మృతి చెందారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

బాధితుల్లో ఎక్కువ మంది బ్లాక్​లోని భంగలి కలాన్, తరివాల్, సంఘా, మరారీ కలాన్ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని అమృత్​సర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.

అమృత్​సర్ డీసీ సాక్షి సాహ్ని ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించి మృతుల సంఖ్యను ధృవీకరించారని, ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

"వీరంతా ఆదివారం సాయంత్రం ఒకే సోర్స్ నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు తెలిసింది. వీరిలో కొందరు సోమవారం ఉదయం మృతి చెందగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దహన సంస్కారాలు నిర్వహించారు. కొందరు ఈ విషయాన్ని దాచిపెట్...