భారతదేశం, మార్చి 29 -- దేశంలో రోజురోజుకు ఆర్థిక మోసాలు పెరిగిపోతున్నాయి! స్కామ్​లు చేసేవారు తమ తెలివిని ప్రదర్శించి అందరిని షాక్​కు గురిచేస్తున్నారు. ఒక్కోసారి, మీకు తెలియకుండానే మీ పేరు మీద కంపెనీని సృష్టించి, దాని ద్వారా కోట్లల్లో లావాదేవీలు జరుపుతున్నారు. చివరికి మీకు నోటీసులు వస్తాయి. ఇలా మీ ఐడెంటిటీని దోచుకుంటున్నారు. మధ్యప్రదేశ్​లో తాజాగా ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. గుడ్లు అమ్ముకునే ఓ వ్యక్తికి ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు వచ్చాయి. రూ. 50కోట్ల ట్రాన్సాక్షన్​పై విచారణకు రావాలని ఆ నోటిసులో ఉంది. అది చూసి ఆ వ్యక్తి షాక్​ అయ్యాడు.

మధ్యప్రదేశ్​లోని పథారియా అనే పట్టణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రిన్స్​ సుమన్​ అనే వ్యక్తి తోపుడు బండి మీద గుడ్లు అమ్ముకుని జీవితాన్ని సాగిస్తున్నాడు. మార్చ్​ 20న అతనికి ఆదాయపు పన్నుశాఖ నుంచి ...