భారతదేశం, ఏప్రిల్ 15 -- ఉత్తర్​ ప్రదేశ్​లో అత్యంత దారుణ, విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ 13ఏళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు అమ్మేశారు. రూ. 5లక్షలు ఇచ్చి బాలికను కొనుకున్న వ్యక్తి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకున్న ఆ బాధితురాలు వారందరిపై ఎఫ్​ఐఆర్​ దాఖలు చేసింది.

యూపీలోని కౌశాంబిలో జరిగింది ఈ ఘటన. 13 ఏళ్ల బాలికను తల్లిదండ్రులు గత నెలలో ఎటాలోని ఓ వ్యక్తికి రూ.5 లక్షలకు అమ్మేశారు. బాలికపై అతను మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక అతని చెర నుంచి తప్పించుకుని తన ఇంటికి తిరిగి వెళ్లింది. 'నిన్ను అమ్మేశాము. నువ్వు అతని దగ్గరికి వెళ్లిపో,' అని తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు!

ఈ వ్యవహారంపై పంచాయతీ కూడా బాలికకు న్యాయం చేయలేకపోయింది. 25 రోజుల సమావేశాలు జరిగినా ఫలితం దక్కలేదు.

తల్లిదండ్రులు ఇంట్లో...