Hyderabad, ఆగస్టు 22 -- హారర్ థ్రిల్లర్ మూవీస్ అభిమానుల కోసం ఇప్పుడు మరో సినిమా ఓటీటీలోకి వస్తోంది. అది కూడా ఐదు నెలల తర్వాత కావడం విశేషం. ఈ తమిళ హారర్ థ్రిల్లర్ మూవీకి థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. అయితేే డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మాత్రం ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల నుంచి కాస్త మంచి రెస్పాన్సే వస్తుంది.

తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ది డోర్ (The Door). ప్రముఖ నటి భావన లీడ్ రోల్లో నటించింది. ఈ సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా తమిళం ఓటీటీలో శుక్రవారం (ఆగస్టు 22) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. అయితే తేదీని మాత్రం చెప్పలేదు.

"అరాచకం.. మంచి థ్రిల్ పంచే థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది గయ్స్.. ది డోర్ త్వరలోనే మన ఆహా తమిళంలో ప్రీమియర్ కానుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. స్ట్రీమింగ్ తేదీని కూడా త్వరలోనే వెల్లడిం...