Hyderabad, జూలై 30 -- తమిళంలో ఈ నెల ఓ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలుసు కదా. ఆ భాషలో బ్లాక్ బస్టర్ అయిన 'సట్టముమ్ నీతియుమ్' ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లోకి రాబోతోంది. జులై 18 నుంచి తమిళ వర్షెన్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు.
తమిళ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సట్టముమ్ నీతియుమ్ ను అదే టైటిల్ తో తెలుగు, హిందీల్లోకి కూడా తీసుకువస్తుండటం విశేషం. ఈ విషయాన్ని బుధవారం (జులై 30) మేకర్స్ వెల్లడించారు.
ఈ శుక్రవారం (ఆగస్ట్ 1) నుంచి జీ5 ఓటీటీలోనే తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. బాలాజీ సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ను 18 క్రియేటర్స్ బ్యానర్ పై శశికళ ప్రభాకరన్ నిర్మించింది. ఈ వెబ్ సిరీస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.