భారతదేశం, జనవరి 31 -- కోలీవుడ్ సినీ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమిళనాడు రాష్ట్ర చలన చిత్ర అవార్డులు (Tamil Nadu State Film Awards) ఎట్టకేలకు వెలువడ్డాయి. 2016 నుంచి 2022 వరకు, గత ఏడేళ్ల కాలంలో సినిమా, టెలివిజన్ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని ప్రభుత్వం గౌరవించింది. ఈ భారీ జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, ధనుష్‌తో పాటు అందరి ఫేవరెట్ సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి తారలు అగ్ర స్థానంలో మెరిశారు.

టెలివిజన్ విషయానికొస్తే, రాధిక శరత్ కుమార్, వాణి భోజన్, నీలిమా రాణి, సంఘవి, రేవతి, రేష్మ, షబానా సహజన్, గాబ్రియెల్లా సుల్లస్, చైత్ర వంటి వారికి అవార్డులు వరించాయి.

లోకేష్ కనగరాజ్: నేడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్, తన మొదటి సినిమా 'మా నగరం'కు గానూ 'ఉత్తమ దర్శకుడు' అవార్డును దక్కించుకోవడం ...