Hyderabad, మే 22 -- తమిళ థ్రిల్లర్ మూవీ పెన్సిల్ (Pencil). ఇది 2016లోనే వచ్చిన సినిమా. జీవీ ప్రకాశ్ కుమార్ లీడ్ రోల్లో నటించాడు. ఈ మూవీ ఆ తర్వాత తెలుగులోనూ డబ్ అయింది. యూట్యూబ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓ మర్డర్ మిస్టరీ మూవీ. సాధారణంగా ఇలాంటి వాటిలో ఉండాల్సినంత థ్రిల్, ట్విస్టులు ఉండవు కానీ చివరి వరకూ హంతకుడెవరన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది.

పెన్సిల్ మూవీ మొత్తం స్కూల్లోనే పట్టపగలు జరిగే ఓ స్టూడెంట్ హత్య చుట్టూ తిరుగుతుంది. ఆ చనిపోయిన స్టూడెంట్ కూడా ఆ రాష్ట్రంలోని ఓ స్టార్ హీరో కొడుకు కావడం విశేషం. అయితే అలాంటి వ్యక్తి హత్యకు గురైన తర్వాత సాధారణంగా ఉండే హడావిడి ఇందులో ఉండదు. అసలు పోలీసులు కూడా రంగంలోకి దిగకముందే ఇద్దరు స్టూడెంట్సే హత్య చేసిందెవరో కనిపెట్టేస్తారు.

2016లో రిలీజైన ఈ థ్రిల్లర్ మూవీ ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరు...