భారతదేశం, ఫిబ్రవరి 3 -- టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన తమన్నా భాటియా.. తాజాగా సోషల్ మీడియాలో ఒక వివాదానికి కారణమైంది. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో ఆమె మాట్లాడుతున్న ఒక వీడియో ఇటీవల బయటికి వచ్చింది. ఇందులో తమన్నా మునుపటి కంటే చాలా సన్నగా, ముఖం పీక్కుపోయినట్లు కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె సహజంగా బరువు తగ్గలేదని, 'ఓజెంపిక్' (Ozempic) అనే ఇంజెక్షన్ వాడుతున్నారని రెడిట్ (Reddit) వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

తమన్నా అనగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆమె నాజూకు వంపులు, ఆకర్షణీయమైన శరీరాకృతి. అయితే ఇప్పుడు ఆమె లుక్ చూసి అభిమానులు నిరాశ చెందుతున్నారు. "ఆమె సహజ సిద్ధమైన అందాన్ని కోల్పోయింది. మిగతా సెలబ్రిటీలలాగే ఆమె కూడా ఇప్పుడు బలహీనంగా కనిపిస్తోంది" అని ఒక నెటి...