భారతదేశం, మే 22 -- ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్ చిత్రాలను చూడాలనుకుంటున్నారా.. అయితే తమిళంలో కొన్ని మంచి ఆప్షన్లు ఉన్నాయి. థ్రిల్లింగ్‌గా భయపెట్టేలా తమిళంలో కొన్ని హారర్ థ్రిల్లర్స్ వచ్చాయి. హారర్ ఇష్టపడే వారిని మెప్పించాయి. వాటిలో తప్పకుండా చూడాల్సిన ఐదు తమిళ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.

అంధగారమ్ సినిమా 2020 నవంబర్‌లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో వినోద్ కిషన్, అర్జున్ దాస్, పూజా రామచంద్రన్, కుమార్ నటరాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విఘ్నరాజన్ దర్శకత్వం వహించారు. అంధుడైన లైబ్రరేరియన్, ఓ క్రికెటర్, ఓ సైకలాజిస్ట్ మధ్య ఈ చిత్రం సాగుతుంది. హారర్, సైకలాజికల్ థీమ్‍లతో థ్రిల్లింగ్‍గా ఈ మూవీ ఉంటుంది. ఆరంభంలో స్లోగా అనిపించిన ఆ తర్వాత గ్రిప్పింగ్‍గా సాగుతుంది. అంధగారమ్ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూ...