Hyderabad, సెప్టెంబర్ 9 -- నటి మనీషా కొయిరాలా నేపాల్ లో నిరసనకారులపై జరిగిన హింసాత్మక దాడి గురించి మాట్లాడారు. ఈ సంఘటనను ఆమె దేశానికి ఒక 'బ్లాక్ డే' అని అన్నారు. అక్కడి జనరేషన్ జెడ్ ఆందోళనకారులు ప్రభుత్వ అవినీతిని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను బ్యాన్ చేయడాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. దీంతో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 20 మంది చనిపోయారు.

నేపాల్ కు చెందిన బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా.. ఒక రక్తంతో తడిచిన షూను సోషల్ మీడియాలో ఒక మెసేజ్‌తో షేర్ చేశారు. ఆమె నేపాల్ భాషలో రాసిన పోస్ట్‌ను తెలుగులోకి అనువదిస్తే ఇలా ఉంది.

"ఈ రోజు నేపాల్‌కి ఒక బ్లాక్ డే. ప్రజల గళానికి, అవినీతిపై ఆగ్రహం, న్యాయం కోసం డిమాండ్ చేసినప్పుడు ఇలా బుల్లెట్లతో సమాధానం చెప్పడం దారుణం" అని మనీషా అభిప్రాయపడింది.

సోమవారం (సెప్టెంబర్ 8) ఖాట...