Hyderabad, సెప్టెంబర్ 26 -- మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ తన లగ్జరీ కారును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేశాడు. శుక్రవారం (సెప్టెంబర్ 26) అతడు కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వారం మొదట్లో ఒక రైడ్ సమయంలో తన కారును సీజ్ చేయడంతో అతడు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కాడు.

దుల్కర్ సల్మాన్ తోపాటు మరో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంటిపై కూడా కస్టమ్స్ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. కస్టమ్స్ ప్రివెంటివ్ వింగ్ ఆపరేషన్ నమ్‌ఖోర్ పేరుతో కేరళలోని ప్రముఖుల వాహనాల అక్రమ దిగుమతులపై విరుచుకుపడింది. ఈ ఆపరేషన్ పేరు భూటాన్ పదం నమ్‌ఖోర్ (వాహనం అని అర్థం) నుండి వచ్చింది.

ఇందులో భాగంగా పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, అమిత్ చక్కలక్కల్ లాంటి ప్రముఖ నటుల నివాసాలు సహా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 చోట్ల దాడులు జరిగాయి. ఈ రైడ్లలో నకిల...