భారతదేశం, జూలై 22 -- హాంకాంగ్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఎయిరిండియా విమానం తోకకు మంటలు అంటుకున్నాయి. విమానానికి కొంత నష్టం జరిగినప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. జూలై 22, మంగళవారం హాంకాంగ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఏఐ 315 విమానం ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి.

2025 జూలై 22న హాంకాంగ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏఐ 315 విమానం ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయని ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు దిగే సమయంలో ఈ ఘటన జరిగిందని, సిస్టమ్ డిజైన్ ప్రకారం ఏపీయూ ఆటోమేటిక్ గా మూసివేయబడిందని తెలిపారు. 'విమానానికి కొంత నష్టం వాటిల్లింది. అయినప్పటికీ, ప్రయాణీకులు మరియు సిబ్బంది సాధారణంగా దిగారు. వారంతా సురక్షితంగా ఉన్నారు. తదుపరి దర్యాప్తు కోసం విమా...