భారతదేశం, ఏప్రిల్ 18 -- ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలుడి హత్య కేసులో లేడీ డాన్ జిక్రా, ఆమె సోదరుడిని అనుమానితులుగా గుర్తించారు. తన సోదరుడి కత్తిపోట్లకు ప్రతీకారం తీర్చుకోవాలనుకునే లేడీ డాన్ జిక్రా ఈ హత్యకు పాల్పడిందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

తన సోదరుడిపై జరిగిన కత్తిపోట్ల దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన ఆమె సొంతంగా ముఠాను ఏర్పాటు చేసుకుంది. ఆమె ఇటీవల ఓ కేసులో జైలుకు కూడా వెళ్లిందని పోలీసు అధికారులు తెలిపారు. బాలుడి దారుణ హత్య సీలంపూర్ లో నిరసనలకు దారితీసింది. "మోదీజీ మదద్ కరో, యోగి మోడల్ చాహియే (మోదీ మాకు సహాయం చేయండి, మాకు యోగి మోడల్ కావాలి)" అని ప్రజలు బోర్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు.

జిక్రా కూడా సీలంపూర్ నివాసి. ఢిల్లీలోని మరో డాన్ హషీం బాబాకు గర్ల్ ఫ్రెండ్ గా ఆమె ఫేమస్. అయితే, మొదట జిక్రా హషింబాబా భా...