భారతదేశం, ఏప్రిల్ 28 -- తెలుగు సినిమా ముత్తయ్య నేరుగా ఓటీటీలోకే అడుగుపెట్టనుంది. థియేటర్లలో విడుదల కాకుండా డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివళ్లలో ప్రదర్శితమై ప్రశంసలు, అవార్డులను ఈ మూవీ అందుకుంది. 'బలగం' సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. ఈ ముత్తయ్య సినిమా ట్రైలర్‌ను నేడు (ఏప్రిల్ 28) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ట్రైలర్ ఎలా ఉందో.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

చెన్నూరు అనే ఓ చిన్న గ్రామంలో నివసించే 70 ఏళ్ల వృద్ధుడు ముత్తయ్య (సుధాకర్ రెడ్డి) చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. నాటకంలో వేషం ఇవ్వాలని ఓ వ్యక్తిని ముత్తయ్య అడగడంతో ట్రైలర్ మొదలైంది. సినిమాలంటే ఆయనకు చాలా పిచ్చి ఉంటుంది. అందుకే థియేటర్లో చిత్రాలు...