భారతదేశం, మే 10 -- తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ కొన్ని హార్డ్ హిట్టింగ్ సినిమాలను రూపొందించారు. తన చిత్రాల్లో సామాజిక సమస్యలు, అసమానతలు, అన్యాయలను ఆయన ఎక్కువగా ప్రస్తావించారు. మనసులను బలంగా తాకేలా, ఆలోచనలను రేపేలాంటి సినిమాలు తీశారు. చాలా సినిమాలకు ప్రశంసలు, అవార్డులు దక్కాయి. వెట్రిమారన్ తెరకెక్కించిన కొన్ని చిత్రాలను తప్పనిసరిగా చూడాలి. అలాంటి ఏడు సినిమాలో ఏవో.. ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

వెట్రిమారన్ తెరకెక్కించిన అసురన్ మూవీ ఓ క్లాసిక్‍గా నిలిచిపోయింది. ఈ మూవీలో ధనుష్ లీడ్ రోల్ చేశారు. 2019లో వచ్చిన ఈ చిత్రం ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‍గానూ హిట్ అయింది. ధనుష్‍కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా దక్కింది. హార్డ్ హిట్టింగ్ స్టోరీతో ఈ రివేంజ్ యాక్షన్ మూవీని వెట్రిమారన్ తెరకెక్కించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓట...