భారతదేశం, సెప్టెంబర్ 11 -- బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 324 పాయింట్లు పెరిగి 81,425 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 104 పాయింట్లు వృద్ధిచెంది 24,973 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 320 పాయింట్లు పెరిగి 54,536 వద్దకు చేరింది.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 33.55 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,963.53 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. గురువారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"ఇక్కడి నిఫ్టీ50 25,200- 25,500 వరకు వెళ్లే అవకాశం ఉంది. 24,800 వద్ద సపోర్ట్​ ఉంది," అని ఈక్విటీ రీసెర్చ్​ హెడ్​ టెక్నికల్​ అండ్​ డ...