భారతదేశం, ఏప్రిల్ 22 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లలో లాభాల పరంపర కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు భారీగా లాభపడ్డాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 855 పాయింట్లు పెరిగి 79,408 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 274 పాయింట్లు వృద్ధిచెంది 24,126 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 1014 పాయింట్లు పెరిగి 55,304 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,970.17 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 246.59 కోట్లు విలువ చేసే కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 55 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"కీలకమైన 24,100 లెవల్స్​ని నిఫ్టీ50 దాటింది. 24,450-24,500 వద్ద ఉన్న రెసిస్టెన్స్​ జోన్​ని సూచీ చేరుకునే...