భారతదేశం, జూలై 30 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 447 పాయింట్లు పెరిగి 81,338 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 140 పాయింట్లు వృద్ధిచెంది 24,821 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 137 పాయింట్లు పెరిగి 56,222 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,576.97 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,027.24 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

"నిఫ్టీ50 24,950- 25,000 వరకు వెళ్లే అవకాశం ఉంది. 25,000 దాటితే నిఫ్టీ 25,200 వరకు వెళ్లొచచు. 24,750 సపోర్ట్​గా ఉంది," అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​ సీనియర్​ టెక్నికల్​ అనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట...