భారతదేశం, సెప్టెంబర్ 29 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 733 పాయింట్లు పడి 80,426 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 236 పాయింట్లు కోల్పోయి 24,655 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 587 పాయింట్లు పడి 54,389 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 5,564.75 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,599.84 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 ప్రస్తుతం 20-డే, 50-డే ఈఎంఐల దిగువన ట్రేడ్​ అవుతోంది. 200-డే ఈఎంఐకి చేరువలో ఉంది. ఇది నెగిటివ్​ సెంటిమెంట్​ని స్పష్టం...