భారతదేశం, ఏప్రిల్ 3 -- అమెరికా వాణిజ్య లోటును తగ్గించడం, అమెరికన్ పరిశ్రమలను బలోపేతం చేయడం లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు అన్ని దేశాల దిగుమతులపై కనీసం 10 శాతం పన్ను విధిస్తూ టారిఫ్ విధానాన్ని ప్రకటించారు. సుంకాల్లో తేడాలను "భయంకరమైన అసమతుల్యతలు"గా అభివర్ణించారు. అమెరికా పారిశ్రామిక రంగం బలహీనపడి, జాతీయ భద్రతకు ప్రమాదం కలిగిస్తోందని ట్రంప్ వాదించారు.

ఏప్రిల్ 2న, డోనాల్డ్ ట్రంప్ "విముక్తి దినోత్సవం"గా ప్రకటించారు. ఈ టారిఫ్‌ల ద్వారా ప్రపంచంలోని 180 దేశాలు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా భారతదేశంపై 26 శాతం పన్ను విధించారు. ఇది అమెరికా దిగుమతులపై భారతదేశం విధించే పన్నులో సగం. ఈ చర్య రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా, ఆటోమొబైల్ దిగుమతులపై 25 శాతం పన్ను టాటా మోటార్స్ వంటి భార...