భారతదేశం, ఫిబ్రవరి 10 -- టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మూడో త్రైమాసిక ఫలితాలను మంగళవారం (ఫిబ్రవరి 10) విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన వ్యాపార గణాంకాలను పరిశీలిస్తే, కంపెనీ లాభాల్లో భారీ వృద్ధిని కనబరిచింది.

గతేడాది ఇదే అక్టోబర్-డిసెంబర్ కాలంలో టైటాన్ కంపెనీ నికర లాభం రూ. 1,047 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది అది ఏకంగా 61 శాతం పెరిగి రూ. 1,684 కోట్లకు చేరుకుంది. కంపెనీ తన కన్సోలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లో ఈ వివరాలను వెల్లడించింది.

ప్రధాన కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం గత ఏడాది రూ. 17,550 కోట్లు ఉండగా, ఈ త్రైమాసికంలో 42 శాతం వృద్ధితో రూ. 24,915 కోట్లకు పెరిగింది. పండుగ సీజన్, పెళ్లిళ్ల సందడి వంటి కారణాలు టైటాన్ వ్యాపార వృద్ధికి తోడ్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ...