భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఇప్పటివరకు మనం 5000 ఎంఏహెచ్​, 6000 ఎంఏహెచ్​ బ్యాటరీలను చూశాము. కానీ త్వరలోనే మన చేతుల్లోకి 8000ఎంఏహెచ్​ బ్యాటరీతో కూడిన స్మార్ట్​ఫోన్స్​ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భారీ బ్యాటరీని ఒప్పో, వన్​ప్లస్​ సంస్థలు టెస్ట్​ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, ఇప్పటికే కంపెనీల హైఎండ్ మోడళ్లలో ఉన్న టెక్నాలజీ మాదిరిగానే కొత్త బ్యాటరీలో 80 వాట్​ సూపర్​వూక్ ఛార్జింగ్ ఉంటుందని తెలుస్తోంది. సిలికాన్ కార్బన్ (ఎస్​ఐ/సీ) టెక్నాలజీని జోడించడం ద్వారా తమ బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి, స్మార్ట్​ఫోన్ పనితీరును మెరుగుపరచడానికి ఈ చైనా బ్రాండ్లు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఒప్పో - వన్​ప్లస్​ మధ్య సంయుక్త పరిశోధన, అభివృద్ధి ప్రయత్నం అయిన ఓగా ల్యాబ్స్​లో భాగంగా ఉన్నాయి. ఇంకా టెస్టింగ్ దశలో ఉన్న 8,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని సిలిక...