భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఓ వైపు తిరుపతి లడ్డూలో కల్తీ వివాదం తీవ్రంగా మారింది. మరోవైపు ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2026న టీటీడీ కార్యనిర్వహణాధికారి(ఈవో) అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేసింది. సాధారణ పరిపాలన విభాగానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్రను టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవోగా నియమించారు. ఆయన వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.

కల్తీ నెయ్యి సరఫరా కావడానికి గత ప్రభుత్వం హయాంలో నెయ్యి సేకరణ విధానం కారణమని గుర్తించారని ప్రచారం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందని అనుమానాలు వచ్చినప్పుడు సింఘాల్ టీటీడీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతల్లో ఉన్నారు. నెయ్యి కల్తీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.. సింఘాల్ ఈ సమస్యను సకాలంలో గుర్తించడంలో విఫలమయ్యారని భ...