Hyderabad, ఆగస్టు 29 -- స్టార్ మా సీరియల్స్ 33వ వారం టీఆర్పీ రేటింగ్స్ లోనూ సత్తా చాటాయి. ముఖ్యంగా కార్తీకదీపం 2 సీరియల్ ప్రతి వారం తన రేటింగ్ మెరుగుపరచుకుంటూనే ఉంది. ఈసారి ఏకంగా 15 రేటింగ్ కూడా దాటిపోయింది. అటు నాలుగు జీ తెలుగు సీరియల్స్ కూడా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.

తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. 33వ వారానికి సంబంధించిన ఈ రేటింగ్స్ ఈ వారం ఒక రోజు ఆలస్యంగా వచ్చాయి. ఇందులో కార్తీకదీపం 2 సీరియల్ ఏకంగా 15.25 రేటింగ్ తో తన తొలి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. కేవలం అర్బన్ రేటింగ్ చూసుకున్నా 11.74తో టాప్ లోనే ఉంది. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతోంది. అయితే ఈవారం మరింత మెరుగైన రేటింగ్ అంటే ఏకంగా 14.58 సాధించడం విశేషం.

మూడో స్థానంలో ఇంటింటి రామాయణం ఉంది. ఈ సీరియల్ కు 33వ వారం 13.34 రేటింగ్ ...