భారతదేశం, మే 18 -- హాలీవుడ్​ లెజెండరీ యాక్టర్స్​లో టామ్​ క్రూజ్​ ఒకరు. ఆయన నటించిన మిషన్​ ఇంపాజిబుల్​- ది ఫైనల్​ రెకనింగ్​ సినిమా తాజాగా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మిషన్​ ఇంపాజిబుల్​ ఫ్రాంచైజ్​కి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. టామ్​ క్రూజ్​ యాక్టింగ్​కి భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉంది. అయితే, చాలా మందికి తమ అభిమాన నటుడి సంపద ఎంత? అని తెలుసుకోవాలని ఉంటుంది. ఈ నేపథ్యంలో 62ఏళ్ల టామ్​ క్రూజ్​ నెట్​ వర్త్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..

పరేడ్​ మ్యాగజైన్​ ప్రకారం.. హాలీవుడ్​ నటుడు టామ్​ క్రూజ్​ నెట్​ వర్త్​ 600 మిలియన్​ డాలర్లు. అంటే అది రూ. 51,36,03,90,000! సినిమాలు, ఇన్వెస్ట్​మెంట్స్​ రూపంలో ఈ స్థాయిలో సంపదను వెనకేసుకున్నారు ఈ మిషన్​ ఇంపాజిబుల్​ యాక్టర్​.

ఫిల్మ్​ ఇండస్ట్రీలో టామ్​ క్రూజ్​ అడుగుపెట్టినప్పుడు తొలుత ఆయనకు 50,000 డాల...