Hyderabad, సెప్టెంబర్ 25 -- స్టార్ మా ఛానెల్ కు గట్టి దెబ్బే తగిలింది. గడిచిన కొన్ని ఏళ్లుగా టాప్ 10లో కనీసం ఆరు నుంచి ఏడు సీరియల్స్ తో సత్తా చాటిన ఆ ఛానెల్ తాజాగా ఐదు సీరియల్స్ కు పడిపోయింది. బ్రహ్మముడి, నువ్వుంటే నా జతగాలాంటి సీరియల్స్ టాప్ 10లో నుంచి వెళ్లిపోయాయి. ఏకంగా ఐదు జీ తెలుగు సీరియల్స్ ఈసారి టాప్ 10లోకి దూసుకొచ్చాయి.

తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మాకు కొన్నేళ్లుగా అసలు తిరుగే లేదు. ఇప్పటికే టాప్ 10లో టాప్ 5 సీరియల్స్ ఆ ఛానెల్ కు చెందినవే ఉన్నాయి. అయితే మరో ఐదు స్థానాలను జీ తెలుగుకు కోల్పోక తప్పలేదు. తాజాగా 37వ వారం రేటింగ్స్ లో కేవలం ఐదు సీరియల్స్ మాత్రమే చోటు దక్కించుకున్నాయి.

టాప్‌లో కార్తీకదీపం 2 సీరియల్ కొనసాగుతోంది. ఈ సీరియల్ కు తాజాగా 14.16 రేటింగ్ నమోదైంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ సీరియల్ రేటింగ్ 14 దాటింది. ఇక రెం...