భారతదేశం, జూన్ 27 -- టాటా మోటార్స్ ఇటీవల తన హారియర్ ఈవీ రియర్-వీల్ డ్రైవ్ (ఆర్​డబ్ల్యూడీ) వేరియంట్ల ధరలను ప్రకటించింది. వీటి ధరలు రూ. 21.49 లక్షల నుంచి రూ. 27.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇప్పుడు, ఆటోమేకర్ హారియర్ ఈవీకి చెందిన మరిన్ని వివరాలను వెల్లడించింది. మరీ ముఖ్యంగా వేరియంట్ల వారీగా ఈ ఎలక్ట్రిక్​ కారు అందించే రేంజ్ గురించి స్పష్టం చేసింది. టాటా హారియర్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ప్రతి వేరియంట్ అందించే రేంజ్‌ను ఇప్పుడు తెలుసుకోండి..

టాటా హారియర్ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. సింగిల్ మోటార్‌తో కూడిన రియర్-వీల్ డ్రైవ్ (ఆర్​డబ్ల్యూడీ) వెర్షన్‌ల కోసం 65 కేడబ్ల్యూహెచ్​, 75 కేడబ్లూహెచ్​ ఆప్షన్స్​ ఉన్నాయి. 75 కేడబ్ల్యూహెచ్​ యూనిట్ డ్యూయెల్ మోటార్ సెటప్‌తో కూడిన క్వాడ్-వీల్ డ్రైవ్ (క్యూడబ్ల్యూడీ) ...