భారతదేశం, సెప్టెంబర్ 6 -- విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ తన రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ వాహనాల్లో చిన్న మోడల్ వీఎఫ్‌6 ఎక్స్​షోరూం ధర రూ. 16.49 లక్షలుగా ఉండగా.. పెద్ద మోడల్ వీఎఫ్‌7 ధర రూ. 20.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ రెండు మోడళ్ల బుకింగ్స్​ రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

కంపెనీ తన కస్టమర్లకు 2028 వరకు ఉచిత ఛార్జింగ్, నిర్వహణను అందిస్తోంది. అలాగే, ఈ ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీలతో పానోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు.

మన్నిక విషయంలో, విన్‌ఫాస్ట్ వీఎఫ్‌7పై 10 సంవత్సరాలు లేదా 2,00,000 కిమీల వారంటీ, వీఎఫ్‌6పై 7 సంవత్సరాలు లేదా 2,00,000 కిమీల వారంటీ ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల్లో ఉన్న విన్‌ఫాస్ట్, తన భవిష్యత్ అవసరాలకు అనుగ...