భారతదేశం, ఏప్రిల్ 30 -- టాటా ఆల్ట్రోజ్ అమ్మకానికి వచ్చిన ఐదు సంవత్సరాల తరువాత, త్వరలో దాని మిడ్-లైఫ్ సైకిల్ అప్​డేట్​ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది. టాటా ఆల్ట్రోజ్​ ఫేస్​లిఫ్ట్​ని మే 22, 2025న మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ హ్యాచ్​బ్యాక్ ఎక్స్​టీరియర్, ఇంటీరియర్​లో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. వాస్తవానికి ఆల్ట్రోజ్​ ఇప్పటికే పలు అప్డేట్స్​ని పొందినప్పటికీ, ఈ ఓవరాల్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​తో ఈ కారు మరింత అట్రాక్టివ్​గా మారుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ హ్యాచ్​బ్యాక్స్​లో టాటా ఆల్ట్రోజ్​ ఒకటి. ఇక ఇప్పుడు టాటా ఆల్ట్రోజ్ ఫేస్​లిఫ్ట్ హ్యాచ్​బ్యాక్ సిల్హౌట్​లో ఎక్కువ మార్పులు లేకుండా విజువల్, ఫీచర్ అప్​గ్రేడ్​లతో వచ్చే అవకాశం ఉంది. రివైజ్డ్ గ్రిల్,...