భారతదేశం, మే 17 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ప్రీమియం హ్యచ్​బ్యాక్​గా గుర్తింపు తెచ్చుకున్న టాటా ఆల్ట్రోజ్​కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోంది. మే 22న ఈ మోడల్​ లాంచ్​కానుంది. 2020లో తొలిసారి బయటకు వచ్చినప్పటి నుంచి ఈ కారుకు ఇదే బిగ్గెస్ట్​ అప్​గ్రేడ్! కాగా ఈ హ్యాచ్​బ్యాక్​ని టాటా మోటార్స్​ ఇప్పటికే ఆవిష్కరించింది. 2025 ఆల్ట్రోజ్ స్మార్ట్​, ప్యూర్, క్రియేటివ్, అకంప్లీష్​డ్​ ఎస్, అంకప్లీష్​డ్​ + ఎస్ అనే ఐదు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో వేరియంట్లు, వాటిల్లో లభిస్తున్న ఫీచర్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

2025 టాటా ఆల్ట్రోజ్ లైనప్ స్మార్ట్ వేరియంట్​తో ప్రారంభమవుతుంది. స్మార్ట్ బేస్ లెవల్ సేఫ్టీ, బేసిక్ డిజైన్ ఫీచర్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మోడల్ పూర్తి భద్రతా ప్యాకేజీ, 6 ఎయిర్ బ్యాగులు, ఈఎస్​పీ వస్తుంది, ఇది ...