భారతదేశం, ఫిబ్రవరి 6 -- రాకింగ్ స్టార్ యష్ బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'కేజీఎఫ్ 2'తో తెలుగునాట అతడు సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ఇప్పుడు అతని తదుపరి సినిమా 'టాక్సిక్' (Toxic) కోసం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాడు. అతనికి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఏకంగా రూ.120 కోట్లకు అధికారికంగా సొంతం చేసుకుంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక నాన్-తెలుగు (డబ్బింగ్) సినిమాకు ఈ స్థాయిలో భారీ మొత్తం చెల్లించి హక్కులు తీసుకోవడం ఇదే తొలిసారి అని, ఇదొక రికార్డు అని తెలుస్తోంది. యష్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని టాక్సిక్ మూవీ కోసం దిల్ రాజు ఈ సాహసం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించాడు. తన ఎక్స్ అకౌంట్...