భారతదేశం, మే 31 -- జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అలర్ట్​! జూన్​ 2, 2025న జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఐఐటీ కాన్పూర్​ వెల్లడించింది. ఫలితాలతో పాటు ఫైనల్​ ఆన్సర్​ కీని కూడా రిలీజ్​ చేయనున్నట్టు స్పష్టం చేసింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్​డ్​ 2025కు హాజరైన అభ్యర్థులు jeeadv.ac.in ఐఐటీ జేఈఈ అధికారిక వెబ్​సైట్​లో ఫలితాలను చూసుకోవచ్చు. జూన్​ 2 ఉదయం 10 గంటలకు రిజల్ట్ లింక్ యాక్టివేట్ అవుతుంది.

జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షను 2025 మే 18న నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరిగింది.

అభ్యర్థుల సమాధానాలు మే 22న, ప్రొవిజనల్ ఆన్సర్ కీని 2025 మే 26న విడుదల చేశారు. 2025 మే 27న అభ్యంతర విండోను మ...