భారతదేశం, మే 12 -- మే 18న జరగనున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కు సంబంధించి జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్ కార్డులను ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ తాజా విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ (jeeadv.ac.in.) నుంచి అడ్మిట్​కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్ కార్డు 2025 డౌన్​లోడ్​ చేసుకోవడానికి గడువు మే 18 మధ్యాహ్నం 2:30 గంటల వరకు అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 అడ్మిట్ కార్డు డౌన్​లోడ్​ చేసుకోవడానికి అవసరమైన లాగిన్ క్రెడెన్షియల్స్​లో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఉంటాయి.

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 పరీక్షను మే 18న రెండు షిఫ్టుల్లో, పేపర్-1 పరీక్షను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయ...