భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్టల్ ఓట్ల నుంచి ఐదో రౌండ్ వరకు కూడా ఆయనే లీడ్ లో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన రౌండ్ల ప్రకారం. కాంగ్రెస్ పార్టీకి 10 వేల ఓట్లకు పైగా లీడ్ లభించింది. ఇప్పటివరకు షేక్‌పేట, ఎర్రగడ్డ, రహమత్‌నగర్‌ డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది.

పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి 39 ఓట్లు రాగా.. తొలి రౌండ్‌లో నవీన్‌యాదవ్‌కు 8,911 ఓట్లు దక్కాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు దక్కగా. నవీన్‌ యాదవ్‌కు 47 ఓట్ల ఆధిక్యం వచ్చింది.ఇక సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ మంచి మెజార్టీ లభించింది. ఈ రౌండ్‌లో నవీన్‌ యాదవ్‌కు 9,691 ఓట్లు, మాగంటి సునీతకు 8,609 ఓట్లు పోలయ్యాయి. మూడో, నాల్గో రౌండ్ లోనూ కాంగ్రెస్ మెజార్టీ మరింత పెరిగ...