భారతదేశం, జూన్ 27 -- దేశంలో బంగారం ధరలు జూన్ 27,​ శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 99,113గా కొనసాగుతోంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 9,913గా ఉంది. మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 90,863కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,086గా ఉంది.

ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం భారీగా పెరిగి, రూ. 1లక్ష మార్క్​ దాటిన 24 క్యారెట్ల బంగారం ధర, ఇప్పుడు దిగొస్తుండటం శుభ పరిణామం.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,715 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 98,965గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,711గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,961గా ఉంది. ఇక బెంగ...