భారతదేశం, జూలై 14 -- దేశంలో బంగారం ధరలు జులై 14, సోమవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 99,883గా కొనసాగుతోంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 9,988గా ఉంది. మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 91,573కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,157గా ఉంది.

గత నెలలో భారీగా పెరిగి, రూ. 1లక్ష మార్క్​ తాకిన 24 క్యారెట్ల బంగారం ధర, ఇప్పుడు రూ. 98వేలు- లక్ష మార్క్​ మధ్యలో కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం స్థిరంగా ఉన్నాయి. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 91,425 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 99,735గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 91,421గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 99,731గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్...