Hyderabad, మే 7 -- ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన జీ5లో కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి. వీటిలో ఈ మధ్యే వచ్చిన టొవినో థామస్, త్రిష నటించిన ఐడెంటిటీ నుంచి మరెన్నో సినిమాలను చూడొచ్చు. మరి ఈ ఓటీటీలో ఉన్న వాటిలో మిస్ కాకుండా చూడాల్సిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలేంటో చూడండి.

ప్రముఖ మలయాళ నటుడు టొవినో థామస్, త్రిష నటించిన మూవీ ఐడెంటిటీ. ఇదొక సూపర్ క్రైమ్ థ్రిల్లర్. ఓ పోలీస్ ఆఫీసర్, ఓ జర్నలిస్ట్, ఓ స్కెచ్ ఆర్టిస్ట్ చుట్టూ తిరిగే కథ. అమ్మాయిలను వేధించే ఓ క్రిమినల్ ను హత్య చేసింది ఎవరు? ఆ కేసును దర్యాప్తు చేసే తీరుతెన్నులను చూపిస్తూ సాగే కథ. ఊహకందని ట్విస్టులతో ఈ ఐడెంటిటీ థ్రిల్ ను పంచుతుంది.

కుంచకో బొబన్, రజిషా విజయన్ నటించిన మూవీ ఈ పాకులమ్ పాతిరవుమ్. ఇదొక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మావోయిస్టుల నియంత్రణల...