Hyderabad, జూలై 10 -- థ్రిల్లర్ జానర్‌కు తమిళ సినిమాలో భారీ ఫ్యాన్‌బేస్ ఉంది. ఈ జానర్ క్రైమ్, సైకలాజికల్, డ్రామా వంటి ఇతర సబ్-జానర్‌లతో కలపడానికి అనువుగా ఉండటంతో మేకర్స్ ఈ థ్రిల్లర్ మూవీస్ తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 5 మస్ట్ వాచ్ తమిళ థ్రిల్లర్ సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.

'పార్కింగ్' అనేది 2023లో విడుదలైన థ్రిల్లర్ డ్రామా మూవీ. ఇందులో హరీష్ కళ్యాణ్, ఎం.ఎస్. భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒకే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న ఒక యువకుడు, ఒక వృద్ధుడు మధ్య పార్కింగ్ స్థలం విషయంలో తలెత్తిన ఘర్షణ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇద్దరి మధ్య ఉద్రిక్తతలు పెరిగి, ఊహించని సంఘటనలకు దారితీస్తాయి. ఈ మూవీకి రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించాడు. అతనికిదే తొలి సినిమా.

'అ...