Hyderabad, మే 30 -- తుడరుమ్.. ఈ ఏడాది పెను సంచలనం సృష్టించిన మలయాళ రివేంజ్ థ్రిల్లర్ మూవీ. మోహన్‌లాల్, శోభన లీడ్ రోల్స్ లో తరుణ్ మూర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తానికి జియోహాట్‌స్టార్ లో డిజిటల్ ప్రీమియర్ అయింది. ఓటీటీలో ఈ మూవీని చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా తెగ మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదే జియోహాట్‌స్టార్ లో మోహన్‌లాల్ నటించిన ఇతర థ్రిల్లర్ సినిమాలేవో ఒకసారి చూద్దాం.

అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా చరిత్ర సృష్టించిన ఎల్2: ఎంపురాన్ కూడా జియోహాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ కూడా ఈ ఏడాదే రిలీజైంది. మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా లూసిఫర్ మూవీకి సీక్వెల్. ఆ సినిమా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్స...