Hyderabad, ఆగస్టు 26 -- బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించిన పరమ్ సుందరి మూవీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే మలయాళీ సింగర్, యాక్టర్ పవిత్ర మేనన్ విమర్శల తర్వాత.. ఇప్పుడు మరో మలయాళీ ఇన్‌ఫ్లుయెన్సర్ దివ్య నాయర్ కూడా జాన్వీ కపూర్ పై మండిపడింది. ఆమె డైలాగులు సరిగా పలకలేదని ఆమె అంటోంది. ఆ క్యారెక్టర్ కోసం జాన్వీని ఎంచుకోవడం తప్పని స్పష్టం చేసింది. ఆ క్యారెక్టర్ లో నిజాయితీగా కనిపించాలంటే ఒక మలయాళీ యాక్టర్ అయితే బాగా సరిపోయేదని ఆమె అనడం గమనార్హం.

రీసెంట్ గా జాన్వీ కపూర్ నటనని విమర్శిస్తూ దివ్య ఒక వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత.. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది. సినిమాలో జాన్వీ పలికిన మలయాళీ డైలాగ్స్ ఏమీ అర్థం కాలేదని ఆమె చెప్పింది. ఇప్పుడు మిడ్-డే అనే పత్రికతో ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాలను పంచుకుంది.

దివ్య మాట్లాడుతూ...