భారతదేశం, జూన్ 15 -- జలపాతంలోకి దూరిన ఒక పాము, టూరిస్ట్​లను దడదడలాడించిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్​ మీడియాలో వైర్​గా మారింది. ఆ వీడియో చాలా భయానకంగా ఉండటంతో, ఆ దృశ్యాలు చూసిన వారందరు షాక్​ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరాఖండ్​ ముస్సోరిలోని కెమ్టీ జలపాతం వద్ద జరిగినట్లు చెబుతున్న ఒక విచిత్రమైన, భయానక సంఘటన కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం.. సరదాగా సాగుతున్న విహారయాత్ర ఒక్కసారిగా గందరగోళంగా మారింది! పర్యాటకులతో కిక్కిరిసి ఉన్న నీటిలో అనూహ్యంగా ఒక పాము కనిపించింది, నీటిలో వేగంగా కదిలింది. దాన్ని చూసిన టూరిస్ట్​లు బెంబేలెత్తిపోయారు. గజగజ ఒణికిపోయి, ప్రాణ భయంతో పరుగులు తీశారు.

వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్‌లో, డజన్ల కొద్దీ పర్యాటకులు సుందరమైన జలపాతాన్ని ఆస్వాదిస్తుండగా, ఒక్కసారిగా కలకలం రేగి...