Hyderabad, జూన్ 9 -- నటుడు రవి మోహన్ తన భార్య ఆర్తి రవితో విడాకుల ప్రక్రియలో ఉన్నప్పటికీ.. మరోవైపు సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో సంబంధంలో ఉన్నాడని చాలా మంది నమ్ముతున్నారు. తాజాగా ఆమె గర్భవతి అని కూడా పుకార్లు వచ్చాయి. అంతేకాకుండా రవి, ఆర్తిల మధ్య విభేదాలకు ఆమె కారణమని నిందించారు. ఈ విషయంపై బిహైండ్‌వుడ్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కెనిషా ఘాటుగా స్పందించింది.

జయం రవితో తన సంబంధంపై వస్తున్న అనేక వ్యాఖ్యలు, పుకార్ల గురించి కెనిషా మాట్లాడింది. 'హోప్' అంటూ ఒక నోట్‌తో తాను పోస్ట్ చేసిన ఒక స్టిల్ చూసి తాను గర్భవతిని అని తప్పుగా అర్థం చేసుకున్నట్లు కెనిషా వివరించింది. అది తన పాట అంద్రుమ్ ఇంద్రుమ్ లోని ఒక స్టిల్ అని, కొందరు పొరపాటున ప్రెగ్నెన్సీ అనుకున్నది వాస్తవానికి తన చేతులు అని స్పష్టం చేసింది. "చాలా మంది నేను గర్భవతి అని అంటున్నారు. నాకు సిక్స్...